అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో
✍️ అర్జితసెలవు(Earned Leave)* ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను *సరెండర్ లీవ్* అందురు.(G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)-(Govt.Circular Memo No.52729 Fin తేది:11-10-1969)➤ ఇట్టి సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.
➤ ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం(ఎయిడెడ్) ఆధ్వర్యంలో పనిచేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ సదుపాయానికి అర్హులు.
(G.O.Ms.No.418 Edn తేది:18-04-1979)
➤ సం॥ నకు 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు. (G.O.Ms.No.334 F&P తేది:28-09-1977)
➤ సరెండర్ లీవ్ కాలానికి పూర్తివేతనం, ఇతర అలెవెన్సులు మంజూరు చేయబడును. IR చెల్లించబడదు. (Govt.Memo.Mo.31948 F&P తేది:12-08-1998)
➤ సరెండర్ లీవ్ 15/30 రోజులకు 12/24 నెలల గ్యాప్ తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు.ఈ సెలవుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివాల్సిన అవసరం లేదు.
(Memo.No.14781-C/278/FR-1/2011 తేది:22-06-2011)
➤ ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారైతే అర్జిత సెలవు మంజూరుచేయు అధికారం కలిగియుంటాడో, అట్టి అధికారే అర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించవచ్చును.
(Para ii of G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)
(Govt.Memo.No.47064/1164/FR-I/4-1 F&P తేది:25-09-1974)
(Govt.Memo.No.50978/1063/FR-I/79-1 తేది:22-11-1979)
➤ సరెండర్ సెలవుకు సంబంధించిన సెలవు జీతం చెల్లించునపుడు ఇంటి అద్దె(HRA)మరియు ఇతర కాంపెన్సెటరీ అలవెన్సు లు కూడా చెల్లించాలి.
(Govt.Memo.No.64861/797/FR-II711 తేది:14-07-1972)
➤ ప్రభుత్వ క్వార్టర్ లలో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ సెలవు జీతంతో HRA పొందుటకు అర్హులు.
(G.O.Ms.No.337 Fin తేది:29-09-1994)
(G.O.Ms.No.131 F&P తేది:25-03-1976)
(Govt Circular Memo No.9258-C/1768/FR-I/76-1 Fin తేది:31-01-1977)
➤ సరెండర్ సెలవు మంజూరైన తేదినుండి 90 రోజుల లోపల బిల్లు నగదు కోసం సమర్పించాలి.* సమర్పించని యెడల సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది.
(Govt Memo.No.271423/A2/97-1/ F&P తేది:18-08-1997)
➤ ఉపాధ్యాయులు ఇటీవల బదిలీలలో భాగంగా ఒక STO పరిధి నుండి మరొక STO పరిధిలోని పాఠశాలకు మారినపుడు సరెండర్ అప్లై చేసిన సందర్భంలో పాత STO కార్యాలయం నుండి Fly leap xerox కాపీని STO గారి Attestation to సమర్పించాలి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.