ఇంక్రిమెంట్లు-రకాలు:
🔅 ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.
🔅 ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.
🔅 APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించరు.
(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)
🔅 నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.
(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974) (G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)
🔅 DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.
🔅 ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరు చేయాలి.
(Memo.No.49463 Dt:06-10-1974)
🔅 ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.
Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.
🔅 నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.
🔅 వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.
ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము
➧ ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.
➧ అన్ని రకాల సెలవులు* (జీత నష్టపు సెలవు తప్ప)
➧ డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.
➧ అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.
➧ పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.
➧ ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.
➧ ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం, (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)
ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం
➧ జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు. సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.
➧ జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భము
➧ వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది. (ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు) (FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)
➧ 6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సందర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.
ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు
➧ తప్పుడు ప్రవర్తనా , విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.
*Without Cumulative Effect:*
➧ FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు. అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.
*With Cumulative Effect:*
➧ దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి. సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి. ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి. ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.